KCR: పార్టీ నేతలతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం.. ఆ ఎన్నికలకు వ్యూహ రచన

by Yella Dhawani Reddy |

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్‌కి తన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సబ్మిట్ చేసి సాధారణ పాస్‌పోర్ట్‌ను తీసుకునేందుకు వచ్చారు.

KCR: పార్టీ నేతలతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం.. ఆ ఎన్నికలకు వ్యూహ రచన
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఈరోజు (ఫిబ్రవరి 19) సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్‌కి (Secunderabad Passport Office).. తన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సబ్మిట్ చేసి సాధారణ పాస్‌పోర్ట్‌ను తీసుకునేందుకు వచ్చారు. అనంతరం నందినగర్‌లోని నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలో విస్తృత స్టాయి సమావేశంలో పాల్గొనున్నారు. కేసీఆర్ ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. దాదాపు 400 మంది కీలక నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు సమావేశంలో నేతలతో చర్చించనున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేసేలాగా వ్యూహ రచన ఉండబోతుంది. ఈనెలాఖరులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Next Story