పార్టీ లైన్ తప్పితే సిట్టింగ్‌లకు కూడా సీటు ఇవ్వను: సొంత నేతలకు KCR సంచలన వార్నింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-27 12:56:22  IST  )

బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ తన మార్క్ రాజకీయ విశ్లేషణతో పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పార్టీ లైన్ తప్పితే సిట్టింగ్‌లకు కూడా సీటు ఇవ్వను: సొంత నేతలకు KCR సంచలన వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ తన మార్క్ రాజకీయ విశ్లేషణతో పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ, డ్రామాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రతిసారి పనిచేయవని నేతలకు గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పనితీరును బట్టే గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. "ఆటో కాలు ఇటో కాలు వేస్తామంటే కుదరదు.. పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో ఉండాల్సిందే" అని పరోక్షంగా ఇతర పార్టీల వైపు చూస్తున్న నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కొత్త కమిటీల ఏర్పాటు విషయంలో కేసీఆర్ కీలక సూచనలు చేశారు. కమిటీల్లో చురుకైన కార్యకర్తలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని, కేవలం నాయకులకు నచ్చిన వారికో లేదా అనుయాయులకో పోస్టులు ఇస్తే ఊరుకోబోనని అన్నారు. కమిటీల ఎంపికలో అన్యాయం జరిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని కార్యకర్తలకు సూచించారు. అటువంటి ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలకు, కొత్త వారికి కమిటీల్లో పెద్దపీట వేయాలని ఆదేశించారు.

టికెట్ల కేటాయింపుపై స్పష్టత..

రాబోయే ఎన్నికల టికెట్ల విషయంలో కేసీఆర్ ఇప్పటి నుంచే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. "ఎవరు సిట్టింగ్ అన్నది ముఖ్యం కాదు.. పార్టీ లైన్‌లో ఉండి, క్రమశిక్షణతో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సిట్టింగ్‌లకు కూడా సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదు" కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని కేసీఆర్ ఉద్ఘాటించారు.

తేజస్వీ సూర్య ఓ వెధవ.. బీజేపీ ఎంపీలు దద్దమ్మలు.. కేసీఆర్ ఫైర్

బీఆర్ఎస్‍లో సంచలనం.. ఆ ఒక్కటి మినహా పాత కమిటీలన్నీ రద్దు

Next Story