- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డికి బీఆర్ఎస్‌లో కీలక పదవి.. జగిత్యాల సభలో కేసీఆర్ సంచలన ప్రకటన
సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ కొనియాడారు. జీవన్ రెడ్డి నిర్ణయాన్ని కేసీఆర్ "గుండె ధైర్యంతో కూడిన నిర్ణయం"గా అభివర్ణించారు. వ్యక్తిగత లాభం కంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని భావించి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన ప్రజా జీవితం ఎంతో మంది రాజకీయ నాయకులకు ఆదర్శమని, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. "మేమిద్దరం 45 ఏళ్లుగా స్నేహితులం. గతంలో రాజకీయంగా విభిన్న ధృవాల్లో ఉన్నా, మా మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంది. రాజకీయ విభేదాలు ఉన్నా ఎప్పుడూ కలిసే ఉన్నాం" అని కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి ఇకనుంచి రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్‌కు పనిచేయబోతున్నారని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
కరీంనగర్ జిల్లాలో తిరుగులేని బలం..
జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చిందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కేవలం జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ రాజకీయాల మీద మంచి అవగాహన, పట్టు ఉన్నాయని ప్రశంసించారు. ఆయనకున్న అశేష కేడర్, అనుభవంతో రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, మరోవైపు జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను పక్కన చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాన్ని జగిత్యాల గడ్డపై మరోసారి ప్రదర్శించారు.






