TG: రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం.. నిర్ణయం ప్రకటించిన కేసీఆర్

by Prasad Jukanti |

సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు.

TG: రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం.. నిర్ణయం ప్రకటించిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సుదీర్ఘ విరామం తర్వాత పబ్లిక్‍లోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో (Telangana Bhavan) జరిగిన బీఆర్ఎస్ (BRS) పార్టీ విస్తృత స్తాయి సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం వెల్లడించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ గంటన్నర సేపు సుదీర్ఘ ప్రసంగం చేశారు. జనవరిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై (Palamuru Rangareddy Lift Irrigation Project) ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. కృష్ణాజలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని ఈ విషయంలో ప్రజలకు అన్ని అంశాలు వివరించాలని ఆదేశించారు. తొలుత మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి అనంతరం భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంలోనూ కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఆ మూడు జిల్లాలను టార్గెట్ చేసిన కేసీఆర్:
కాగా కేసీఆర్ ప్రకటించిన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు బీఆర్ఎస్ ను భారీగా దెబ్బ కొట్టాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించాయి. అయితే ప్రభుత్వం మారాక కేసీఆర్ ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలలతో ముడి పడిన కృష్ణా నీటి అంశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఇవే జిల్లాలను కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహించాలని చూస్తుండటం స్టేట్ పాలిటిక్స్ లో హీట్ పెరుగుతోంది. మరి కేసీఆర్ గేమ్ కు అధికార పక్షం ఎలా చెక్ పెట్టబోతోందని అనేది ఉత్కంఠగా మారింది.

Next Story