- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను కొడితే మాములుగా ఉండదు.. కాంగ్రెస్‌కు KCR సంచలన వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్(Erravalli Farmhouse)లో ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అన్నారు. కైలాసం ఆడుతుంటే పెద్దపాము మింగినట్లుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని తెలిపారు. మళ్లీ కరెంట్ కోతలు, మంచినీళ్ల కరువు కనిపిస్తోందని అన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటోందని ఆరోపించారు. ఇక లాభం లేదు.. ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. నమ్మి ఓట్లు వేస్తే మంచి గుణపాఠం చెప్పారని తెలిపారు.
సంగమేశ్వర(Sangameshwara), బసవేశ్వర(Basaveshwara) ఎత్తపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది.. గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలు సంగతి పక్కనబెడితే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిశారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా తాము రైతుబంధు, దళితబంధు, పింఛన్లు ఇలా ఏవీ ఆపలేదని గుర్తుచేశారు. ‘కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదు’ అని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read More..
ఆ రంగాన్ని CM రేవంత్ చేజేతులా నాశనం చేస్తున్నాడు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు






