- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మా పనైపోయింది'.. వరంగల్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. పూల బొకేలాంటి దేశంలో కొందరు దుర్మార్గులు.. తమ స్వార్థ, నీచ రాజకీయాల కోసం విష బీజాలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తీరు ఏ రకంగానూ సమాజానికి మంచిది కాదన్నారు. తన వయస్సు 68 సంవత్సరాలు అని.. ఇక మా కాలం అయిపోతుందని కేసీఆర్ కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఇక భవిష్యత్ విద్యార్థులదేనని.. యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే, జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ సీఎం కేసీఆర్ మా కాలం అయిపోతుందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Next Story






