- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పొలిటికల్ హీట్.. 119 నియోజకవర్గాలు కవర్ చేసేలా కేసీఆర్ న్యూ ప్లాన్!
తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ రాష్ట్రవ్యాప్త సరికొత్త ప్రణాళికతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం మరోసారి సెగలు కక్కుతోంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభల ద్వారా సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకోగా త్వరలోనే తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ టూర్ రాజకీయంగా నిప్పులు రాజేస్తోంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ విమర్శల దాడికి సతమతం అవుతున్న బీఆర్ఎస్‍కు గోరుచుట్టు మీద రోకటిపోటు అన్న చందంగా ఇప్పుడు కవిత పార్టీ కొత్త టెన్షన్‍గా మారింది. కారు స్పీడ్‍కు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏ మేరకు బ్రేకులు వేయగలుగుతుంది అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ ఇంటి గుట్టును కవిత ఏ మేరకు డ్యామేజ్ చేయబోతున్నారు అనేది గులాబీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యూహరచం చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో బస్సు యాత్రలు:
రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ దాదాపు ఏడాది విరామం తర్వాత మొన్నటి జగిత్యాల సభతో ప్రజల ముందుకు వచ్చారు. ఈ సభ ద్వారా ఆయన తిరిగి కమ్ బ్యాక్ ఇచ్చారనే జోష్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ, ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా ఆయన మరో భారీ వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీశ్ రావు.. మా పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించగా ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు ప్రణాళికలు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండున్నారేళ్ల కాలం మిగిలి ఉంది. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది.
అందుకోసమే రేవంత్ రెడ్డి బీజేపీ నేతల వద్దకు:
రాజకీయంగా బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్, నన్ను బద్నాం చేసేందుకే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తయారైందని హరీశ్ రావు అన్నారు. ఈ కమిషన్ నివేదికపై ఒక వేళ హైకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడం, అనుకూలంగా వస్తే కేవియట్ దాఖలు చేయాలనే ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఓటుకు నోటు కేసు ప్రభావితం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను కలుస్తున్నారని ఆరోపించారు. ముందు రోజు రాత్రి రాహుల్ గాంధీని కలిసి ఆ మర్నాడు ఉదయమే బీజేపీ కేంద్ర మంత్రి ఇంట్లో అల్పాహారానికి వెళ్లారని ఆరోపించారు. సీనియర్ అడ్వకేట్లు దొరకకుండా ప్రభుత్వం బ్లాక్ చేస్తోందని మూడు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించకుండా ఉండేందుకు ఒక సీనియర్ అడ్వకేట్ కు ఒక్కో కేసులో రూ. 30 లక్షలు చెల్లించారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.






