- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలి.. మాజీ సీఎం కేసీఆర్ కీలక మెసేజ్
శ్రీరామ నవమి (Rama Navami) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామ నవమి (Rama Navami) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక సందేశం విడుదల చేశారు. ఇంటికి పెద్ద కొడుకుగా, ఆదర్శవంతమైన రాజ్య పాలకుడిగా, శ్రీరాముడు చేసిన త్యాగాలు, అనుసరించిన సాంప్రదాయ విలువలు, మార్గము, హిందూ ప్రజల ఇలవేల్పులుగా శ్రీ సీతారామ దంపతుల ఆదర్శాలు పూజనీయమైనవని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం త్యాగపూరిత మార్గాలను అనుసరించిన సీతారాములు పుణ్య దంపతులని తెలిపారు. భారతదేశ కుటుంబ వ్యవస్థకు, భార్యాభర్తల అనుబంధానికి వారు మార్గదర్శకులని తెలిపారు.
లోక కళ్యాణం కోసమే సీతారాముల పవిత్ర కళ్యాణ బంధమని కేసీఆర్ కొనియాడారు. నేటి యువతీ యువకులు పుణ్య దంపతులైన సీతారాముల అనురాగ దాంపత్య మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేసీఆర్ తెలిపారు. ఆ ఆదర్శ దంపతుల దీవెనలు తెలంగాణ ప్రజలపైన కలకాలం ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించేలా ఆ పుణ్య దంపతులు దీవించాలని కేసీఆర్ ప్రార్థించారు.






