ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు.. ధైర్యంగా ఉండండి: కేసీఆర్ పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 11:47:26  IST  )

బీఆర్ఎస్(BRS) పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్(KCR) సమావేశం అయ్యారు.

ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు.. ధైర్యంగా ఉండండి: కేసీఆర్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్(KCR) సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంతో ప్రజలు, రైతులకు కలిగిన ఉపయోగాన్ని మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాళేశ్వరం కమిషన్ కాదని.. కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించారు. ఈ నివేదిక వల్ల బీఆర్ఎస్ వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు కాళేశ్వరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ ఊహించిందే. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేయొచ్చు.. ఎవరూ భయపడొద్దు.. అందరూ ధైర్యంగా ఉండండి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story