ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్‌ ఆలోచన.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-04-15 06:29:57.0  )
ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్‌ ఆలోచన.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శంషాబాద్‌ (Shamshabad)లోని నోవొటెల్‌ (Novotel)‌‌లో కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (Congress CLP Meeting) జరగనుంది. ఈ భేటీలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడమే ఎజెండాగా సమావేశంలో కాంగ్రెస్ (Congress) శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ, భూభారతి, సన్నబియ్యంతో పాటు ఇదిరమ్మ ఇళ్లపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ క్రమంలోనే సీఎల్పీ సమావేశానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరగుతోందని కామెంట్ చేశారు. కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రజా బలంలేని బీఆర్ఎస్ రూ.వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ (KCR) ఆలోచనేనని.. కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు కంటున్నారని.. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అన్ని పరిణామాలను గమనించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారని.. భవిష్యత్తులో కూడా అదే పని చేస్తారని తాను నమ్ముతున్నానని మంత్రి పొంగులేటి అన్నారు.

అదేవిధంగా సీఎల్పీ భేటీపై ఆయన స్పందిస్తూ.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నామని అన్నారు. ఎన్నికల సందర్భంగా అన్నదాతలకు ఇచ్చిన మాటల ప్రకారం ‘ధరణి’ ప్రక్షళన చేసి బంగాళా‌ఖాతంలో వేశామని అన్నారు. ‘భూభారతి’ ఆర్వోఆర్-2025 చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని తాము సన్నబియ్యం ఇస్తున్నామని కామెంట్ చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక పార్టీలు, కులాలు, మతాలకు అతీంతంగా ఉంటుందని అన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసి.. ఎస్సీ ఉప కులాల ఆకాంక్షను నెరవేర్చామని తెలిపారు. ప్రజలు ఓట్లేస్తేనే తాము అధికారంలోకి వచ్చామని.. ప్రభుత్వంలో కొనసాగాలో లేదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే డిసైడ్ చేస్తారని బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed