BRS: కేసీఆర్ ఆలోచనకు సొంత నేతల అడ్డు? స్థానిక ఎన్నికల వేళ గులాబీ పార్టీలో చేరికల లొల్లి!

by Prasad Jukanti |

బీఆర్ఎస్ లో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలను ఆ పార్టీ నేత అడ్డుపడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నది.

BRS: కేసీఆర్ ఆలోచనకు సొంత నేతల అడ్డు? స్థానిక ఎన్నికల వేళ గులాబీ పార్టీలో చేరికల లొల్లి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను కనుసైగలతో శాసించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇప్పుడు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు అధికారానికి దూరం కావడం మరో వైపు సొంత ఇంటిలోనే అసమ్మతిస్వరాలు కారుపార్టీ అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెయిన్ అయిన తమ సత్తా నిరూపించుకుందామని చేస్తున్న ప్రణాళికలకు ఇప్పుడు సొంత పార్టీనేతలే అడ్డుగా మారుతున్నారనే చర్చ గులాబీ పార్టీలో వర్గాల్లో వినిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ దూకుడుతో రాబోయో రోజులు బీఆర్ఎస్ కు మరింత చాలెంజ్ గా మారబోతున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న వేళ అందివచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకుసాగాల్సిన పరిస్థితుల్లో కారు పార్టీకి స్పీడ్ బ్రేకుల్లా మారిన నేతల తీరును కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

మళ్లీ బీఆర్ఎస్ వైపు మాజీ ఎమ్మెల్యే:

రాష్ట్రంలో అధికారంలో కోల్పోగానే పది మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోయారు. అదే బాటలో దిగువశ్రేణి నాయకులు సైతం కండువాలు మార్చారు. తాజాగా పార్టీని వీడిన వారిలో కొంత మంది తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాంటి వారిలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Koneru Konappa) తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ఆయన చేరికకు అధినేత కేసీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన చేరిక విషయంలో ఇప్పటికే కేసీఆర్ తో కోనప్ప చర్చలు జరిపారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జోగురామన్న, జగదీశ్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారనే టాక్ వినిపిస్తోంది. తాను బీఆర్ఎస్ ను (BRS) వీడటానికి గల కారణాలను ఆయన కేసీఆర్ కు వివరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికే నిజం అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కొంత మేర మేలు జరిగే అవకాశం ఉంది. అయితే కోనప్ప చేరికను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా నియోజకవర్గంలో పర్యటించిన ఆర్ఎస్పీ ఆ సందర్భంగా మాట్లాడుతూ.. తాను రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా సిర్పూర్ నుంచే పోటీ చేయబోతున్నానన్నారు. ఇక్కడి సంపదను ఆంధ్రకు తరలించిన వారు తిరిగి పార్టీలోకి రానివ్వొద్దని కేటీఆర్ కు తాను చెప్పానని హాట్ కామెంట్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆర్ ఎస్పీ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన రాక పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడారు. ఈ నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తుండగా అందుకు ఆర్ఎస్పీ వర్గం అడ్డుపడుతుందనే టాక్ ఇప్పుడు కారు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కేటీఆర్ అలా కేసీఆర్ ఇలా!:

తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడిన వారి విషయంలో కేసీఆర్, కేటీఆర్ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయా అనే చర్చ కూడా గుప్పుమంటోంది. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ గతంలో చెప్పారు. అయితే కోనప్ప విషయంలో కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుండటంతో తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంలో తండ్రి, కొడుకుల తీరు గులాబీ పార్టీలో ఇంట్రెస్టింగ్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం కవిత రూపంలో ఇంటి పోరు.. మరో వైపు ప్రత్యర్థుల ఏదురుదాటితో సతమతం అవుతున్న మాజీ ముఖ్యమంత్రి చేరికల విషయంలో ఎలాంటి వ్యూహంతో ఉన్నారనేది వేచి చూడాలి.

Next Story