- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్.. అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారంటున్న తల్లి
కేసీఆర్ మనవడు రితేష్ రావు కనిపించడం లేదని రమ్య రావు ఆరోపించారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నడనే విషయాన్ని చెప్పడం లేదని ఫైర్ అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ మనవడు రితేష్ రావు కనిపించడం లేదని రమ్య రావు ఆరోపించారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. సిటీ వ్యాప్తంగా గాలించిన తన కొడుకు ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో డీజీపీ ఆఫీస్ ను ముట్టడించేందుకు కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు బయలుదేరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని వివిధ సమస్యలపై వెంటనే పరిష్కరించాలని NSUI అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ప్రివెంటీవ్ అరెస్ట్ కింద NSUI ముఖ్య కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.అయితే అరెస్ట్ అయిన వాల్లు ఎక్కడ ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచడంపై రమ్య రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






