అమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరూ అమెరికాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగినా దానిపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు, అసంతృప్తి రగులుతోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ కుటుంబ సభ్యులు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండటం ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

నార్త్ కరోలినాకు కవిత..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తన కుమారుడి స్నాతకోత్సవంలో భాగంగా ఆమె అమెరికాలోని నార్త్​కరోలినాకు వెళ్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కవిత సీబీఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని అక్కడికి వెళ్తున్నట్టు తెలిసింది. సీబీఐ షరతుల నేపథ్యంలో ఆమె తిరిగి ఈనెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాచారం.

డల్లాస్‌కు కేటీఆర్..

ఎమ్మెల్సీ కవిత తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత 26న కేటీఆర్.. అమెరికాకు వెళ్లనున్నారు. డల్లాస్‌లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి ఆయన వచ్చేనెల 4న హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గతనెల​27న ఎల్కతుర్తి నిర్వహించారు. అదే ఉపులో ఉన్న గులాబీ పార్టీ నాయకులు.. ఇతర దేశాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు సైతం అమెరికాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ..

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ తన డిప్లమాట్​పాస్‌‌పోర్ట్‌ను సరేండర్ చేసి సాధారణ పాస్‌పోర్టు తీసుకున్నారు. ఆ తరువాత ఆయన అమెరికా స్టాపింగ్​సైతం చేయించుకున్నారు. అమెరికన్​కాన్సులెట్​కార్యాలయానికి వెళ్లి స్టాపింగ్​ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. దీంతో కేసీఆర్​సైతం అమెరికా పర్యటనకు వెళ్తారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విదేశీ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. విదేశీ పర్యటన అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరి ఆయన అమెరికా పర్యటనకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉన్నది.

Next Story