త్వరలోనే KCR కుటుంబం జైలుకు: MP కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
త్వరలోనే KCR కుటుంబం జైలుకు: MP కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం త్వరలోనే జైలుకు వెళ్తోందని వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో ఉనికి లేకుండా సీఎం కేసీఆర్ చేశారని ఫైర్ అయ్యారు. గతంలో కమ్యూనిస్టులను తోక పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను.. కమ్యూనిస్టులు ఆలోచించాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తేలియదన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి ఏ రాజకీయ పార్టీ చేయలేదని సంచలన ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి కేసీఆర్ కుటుంబంపై విమర్శల వర్షం కురిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed