- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranthi: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో మూడు రోజుల పాటు సంక్రాంతి వైభవం కొనసాగుతుందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని కేసీఆర్ తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయని అన్నారు.
దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి పర్వదినం హిందూ శాస్త్ర పురాణాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉందని కేసీఆర్ తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన వ్యవసాయాభివృద్ధిని ఈ సందర్భంగా స్మరించుకున్న ఆయన, రాష్ట్ర వ్యవసాయ రంగం మరింత పుంజుకుని రైతాంగ సంక్షేమం తిరిగి గాడిన పడాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.






