రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన KCR

by Gantepaka Srikanth |

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ, క్రమశిక్షణను పెంపొందిస్తుందన్నారు. గంగా జమునా, తెహజీబ్‌కు తెలంగాణ జన జీవనం దర్పణంగా నిలుస్తుందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌నలో పలు కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింద‌ని గుర్తు చేశారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణకు మ‌నం దేశానికే ఆద‌ర్శంగా నిలిచామ‌ని, అదే వార‌స‌త్వాన్ని కొన‌సాగించాలన్నారు. నెల రోజుల పాటు సాగే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోద‌రుల ఆకాంక్షలు దేవుని దీవెన‌ల‌తో సాకారం కావాల‌ని కేసీఆర్ ప్రార్థించారు.

Next Story