KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్

by Muthe.Rajitha |

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరు కానున్నారని సమాచారం.

KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరు కానున్నారని సమాచారం. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project)లో అవినీతి, నిర్మాణ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలు, ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తోంది.

ఇప్పటివరకు 100 మందికి పైగా అధికారులు, నిపుణులను విచారించిన కమిషన్, 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మే 21న మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5, 2025న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మాజీ మంత్రులు హరీశ్ రావు(Harish Rao) (జూన్ 6), ఈటల రాజేందర్(Eetala Rajender) (జూన్ 9)లకు కూడా నోటీసులు అందాయి. అయితే ఈ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్వయంగా హాజరవుతారా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఈ విచారణలో.. కేసీఆర్ సూచనల మేరకే బ్యారేజీల స్థల ఎంపిక, డిజైన్ మార్పులు జరిగాయని, ఈ నిర్ణయాల వల్లే ప్రాజెక్ట్ వైఫల్యం, రూ.1.2 లక్షల కోట్ల ఖర్చు జరిగిందని అధికారులు కమిషన్ ముందు వెల్లడించారు. ఇటీవలే కమిషన్ గడువు జులై 31 వరకు పొడిగించబడింది. కేసీఆర్ హాజరైతే, ఆయన వివరణ తీసుకుని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. లేకపోతే ఏకపక్ష నివేదికపై కేసీఆర్ కోర్టుకు వెళ్లవచ్చనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.

Next Story