- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sama: కేటీఆర్ ను నమ్మని కేసీఆర్ : సామ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తన కొడుకునే నమ్మడం లేదంటూ కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తన కొడుకునే నమ్మడం లేదంటూ కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కొడుకు కేటీఆర్(KTR)కు కాకుండా అల్లుడు హరీష్ రావు(Harish Rao)కు ఇవ్వడాన్ని సామ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అలాగే కార్యకర్తలపై కేసీఆర్ వ్యక్తం చేసిన అసహనాన్ని సామ ప్రస్తావించారు. కేసీఆర్ దృష్టిలో టిల్లు ఉత్త డల్లు...కొడుకు మీద కోపం కార్యకర్తల మీద చూపించిన వైనం...వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాట్ వర్కింగేనా? కొడుకు ముందుంటే పార్టీ కూలుడే అని భావించినట్టున్నాడంటూ సామ వంగ్య విమర్శలు చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించి కొడుకు టిల్లుని నమ్మక అల్లుడు అగ్గిపెట్టె హరీష్ రావుకి కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని..దీంతో సైకో రామ్ సోషల్ మీడియా వర్గం నిరాశలో పడిపోయిందని...ఈ నెల జీతాలు పడతాయో లేదో అని ఆందోళనలో పింకీలు అంటూ సామ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదే కాకుండా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కులగణన.. బీసీ సీఎం, బీసీ అధ్యక్షుడు, బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి వాటిపైన ఎలాంటి ప్రస్తావన చేయకపోవడాన్ని కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంది. బిడ్డ కవిత బీసీ నినాదంతో రాజకీయం చేస్తుంటే తండ్రి కేసీఆర్ బీసీ ఊసెత్తని తీరు కేసీఆర్ కు బీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల చిన్నచూపుకు నిదర్శనమంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.






