నాలుగున్నర కోట్ల ఆకాంక్షలను వేల కోట్లతో తన్నుకుపోయిన KCR.. ఆకునూరి మరళి ఫైర్!

by Disha Web Desk 4 |
నాలుగున్నర కోట్ల ఆకాంక్షలను వేల కోట్లతో తన్నుకుపోయిన KCR.. ఆకునూరి మరళి ఫైర్!
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వేలకోట్ల కుంభకోణాలతో కేసీఆర్ కుటుంబం తన్నుకుపోయిందని జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, విశ్రాంత ఐఎఎస్ ఆకునూరి మరళి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర 20 వరోజు సోమవారం నాగర్ కర్నూల్, బిజినెపల్లిలలో కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరిట అడ్డు అదుపులేని అవినీతి జరిగిందని దాని ఫలితంగానే ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందన్నారు.

రాష్ట్రంలో విద్యా, వైద్య శాఖలను నిర్వీర్యం చేశారని అయిందన్నారు నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. నిరుపేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు, కార్మికులకు కనీస వేతనాలు అందలేదన్నారు. రైతుబంధు.. రైతులు కానీ రైతులకు జేబులు నింపుతుందన్నారు. చిన్నస్థాయి రైతులు, రైతు కూలీల బతుకులు అద్వానంగా మారాయన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన నియంతృత్వ కేసీఆర్ పాలనను ఓడించాలన్నారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం విదేశాలలో ఉన్న నల్ల ధనం తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అనే భారీ ఎజెండాను ప్రకటించి మొండి చేయి చూపిందన్నారు. కానీ బడా కార్పొరేట్ కంపెనీలకు రూ.16లక్షల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. ప్రజల మధ్య కులమత బేధాలు రెచ్చగొట్టే విధానాలు అమలు చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు.

మోడీ విధానాలను 9 ఏళ్లుగా కేసీఆర్ సమర్థిస్తూ వచ్చారన్నారు. వీరికి మతతత్వ ఎంఐఎం పార్టీ మద్దతిస్తుందన్నారు. ఈ మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో, దేశంలో దేశ సంపదను దోచుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న మోడీ, కేసీఆర్ సర్కార్లను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొ. లక్ష్మి నారయణ, పద్మజా, వినాయక్ రెడ్డి, నైనాల గోవర్దన్, యస్ ఎల్ పద్మ, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రామకృష్ణ, పులి కల్పన, నిర్మల సంధ్య, సౌజన్య, గౌస్, బాలు, రాము, సారన్న, వినయ్, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed