- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తా: KCR హెచ్చరిక
పాతాళంలో దాక్కున్నా లాక్కొస్తా: KCR హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు బీఆర్ఎస్ హయాంలో నీళ్లిచ్చామని గుర్తుచేశారు. 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండేళ్లుగా ఎందుకు పూర్తిచేయడం లేదని మండిపడ్డారు. దీనిపై ప్రజాక్షేత్రంలో నిలదీద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. చెక్‌డ్యామ్‌లను బాంబులు పెట్టి పేలుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పేల్చినోడు పాతాళంలో దాక్కున్నా పట్టుకొస్తామని అన్నారు. తప్పకుండా.. అంతకంతా అనుభవించాల్సిందే అని హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని.. అందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనం అని తెలిపారు.
ఇక మనం మౌనంగా ఉండొద్దని.. ప్రతిపక్షంగా మన బాధ్యతను 100 శాతం నిర్వర్తించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదని కేసీఆర్ తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతున్నదని అన్నారు.






