- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్లనుంచి మౌనంగా ఉన్నా.. రేపటి నుంచి తోలు తీస్తా: కేసీఆర్
రెండేళ్లనుంచి మౌనంగా ఉన్నా.. రేపటి నుంచి తోలు తీస్తా: కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) రెచ్చిపోయారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము తప్పకుండా నిర్వర్తిస్తామని అన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తోంది. ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించా. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించింది. కానీ, బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్నవారే లేరు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశాం.
పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం’’ అని కేసీఆర్ వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడి నడుస్తోంది. అందుకే చంద్రబాబు మాట విని కేంద్రం డీపీఆర్ వెనక్కి పంపింది. అలా చేస్తే కేంద్రంపై యుద్ధం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండిపోయిందని మండిపడ్డారు. ఇకపై తాము రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడుతాం. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నాను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాను.. ఇక అవకాశం ఇవ్వను.. మౌనంగా ఉండను.. తెలంగాణను అన్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తే.. తోలు తీస్తా అని కేసీఆర్ సంచలన వార్నింగ్ ఇచ్చారు.






