- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addanki Dayakar : కేసీఆర్.. వెయిటింగ్ ఇక్కడ: అద్దంకి దయాకర్ కౌంటర్
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల పాలనను నేను ఇన్ని రోజుల నుంచి గంభీరంగా, మౌనంగా చూస్తున్నానని..ఇక బయటకొచ్చి కొట్లాడుడేనని...నేను కొడితే మామూలుగా ఉండదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకు(Congress Leaders)లు వరుసగా కౌంట(Counters In A Row)ర్లు వేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల పాలనను నేను ఇన్ని రోజుల నుంచి గంభీరంగా, మౌనంగా చూస్తున్నానని..ఇక బయటకొచ్చి కొట్లాడుడేనని...నేను కొడితే మామూలుగా ఉండదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకు(Congress Leaders)లు వరుసగా కౌంట(Counters In A Row)ర్లు వేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందితే..ప్రజలు సమస్యల్లో ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా..ఫామ్ హౌజ్ లో ఎందుకు ఉన్నావంటూ ఒకరు..నీవు బయటకు రావాలనే మేం చూస్తున్నామంటూ మరోకరు వరసగా కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్ పై విరుచుక పడుతున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అద్ధంకి దయాకర్(Addanki Dayakar)స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బయటకు రావాలని..మేం కూడా కేసీఆర్ బయటకురావాలనే(Ready for KCR)చూస్తున్నామని..ఆయన బయటకు వస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూద్దామ(Waiting Here)ని దయాకర్ సవాల్ చేశారు. మీరు తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి.భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుని మళ్లా తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చుద్దామని దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ వీడి బయటకు రావాలని మేం కూడా ఎదురు చూస్తున్నామన్నామని.. ఎందుకంటే వేయి ఎనుగులు తిన్న రాబంధు ఏ విధంగా మాట్లాడుతదో..ప్రజల్ని ఎట్లా కన్వీన్సు చేస్తదో చుద్దామన్నారు.
కేసీఆర్ మాములుగా ఉన్నా..ఇంకా ఎట్లా ఉన్నా మేం కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వం సిద్ధమని దయాకర్ సవాల్ విసిరారు. ఇంకా మీకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం భ్రమేనని, మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు. ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు బయటకు వచ్చాకా తెలుస్తది..తస్మాత్ చూసుకోండని కేసీఆర్ కు చురకలేశారు. ఇంకా నయానో భయానో వాళ్లనో వీళ్లనో బతిలాడుకుని మీ పార్టీని, కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని..మీ మీద..మీ కుటుంబం మీద ఎన్ని కేసులున్నాయో..బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో..బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారారో మాకు అంతా తెలుసంటూ కేసీఆర్ వైఖరిని దయాకర్ దుయ్యబట్టారు.






