వరి తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి: డీఎఫ్ఓ

by Jakkula.Mamatha |

రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు పండించే దిశగా అడుగులు వేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, పిలుపునిచ్చారు.

వరి తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి: డీఎఫ్ఓ
X

దిశ, వీపనగండ్ల: రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు పండించే దిశగా అడుగులు వేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, పిలుపునిచ్చారు. మండలంలోని వీపనగండ్ల గోపాల్ దిన్నె రైతు వేదికల్లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల్లో ఒక పంట విఫలమైన మరో పంట ద్వారా దిగుబడి పొందవచ్చన్నారు. రైతులు అంతర పంటగా పప్పుధాన్యాలు సాగు చేయడంతో భూమిలో నత్రజని స్థిరీకరణ జరిగే నేల సారవంతంగా మారుతుందని తెలిపారు. కంది, మినుములు వంటి పప్పు ధాన్యాల ఆకుల రాలడంతో భూమిలో కర్బన శాతం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరుతడి పంటలు ముద్దు వరి వద్దు అని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు సర్పంచ్ మీసాల పార్వతమ్మ, ఉప సర్పంచ్ బాలపీరు, ఏఈఓలు మధుమోహన్, నరేష్, పంచాయతీ సెక్రటరీ రమేష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story