ఢిల్లీ పర్యటనకు కేసీఆర్!

by Muthe.Rajitha |   (  Updated:2025-07-30 17:26:27  IST  )

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటనకు కేసీఆర్!
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గులాబీ నేత ప్రత్యక్ష పోరాటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆవశ్యకతను వివరించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోసం BRS నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ ఆగస్టు 6న ధర్నా చేపట్టనుంది. ఆ తర్వాత కేసీఆర్ కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story