KCR: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం.. సిట్ విచారణకు గడువు కోరనున్న కేసీఆర్?

by Prasad Jukanti |

సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

KCR: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..  సిట్ విచారణకు గడువు కోరనున్న కేసీఆర్?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపటి దర్యాప్తుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ నోటీసులు రావడం పట్ల కేసీఆర్ (KCR) ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సిట్ (SIT) నోటీసుల నేపత్యంలో మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్‍కు వెళ్లబోతున్నారు. సిట్ నోటీసులపై వీరు అక్కడ కేసీఆర్‍తో చర్చించనున్నారు. రేపటి వచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై పలువురు న్యాయవాదులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపబోతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎననికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నందునా విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలోనూ వాయిదా:

కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల దర్యాప్తు విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలోనూ కేసీఆర్ ఇదే తరహా వ్యవహరించారు. 2025 జూన్ లో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే కొన్ని పనుల వల్ల జూన్ 11 వరకు సమయం కావాలి కేసీఆర్ కోరగా అందుకు కమిషన్ సైతం అంగీకరించింది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఇదే తరహాలో విచారణకు గడువు కోరుతారా లేక రేపే విచారణను ఎదుర్కొంటారా అనేది ఉత్కంఠగా మారింది.

Next Story