- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో కాళేశ్వరం విచారణకు KCR.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
కాళేశ్వరం (Kaleshwaram)పై విచారణ చివరి దశకు చేరింది. 11 నెలల కాలంలో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీ చంద్రఘోష్ (Justice P Chandraghosh) కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు హరీశ్ రావుతో పాటు ఈటల రాజేందర్‌ను విచారించింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleswharam)పై విచారణ చివరి దశకు చేరింది. 14 నెలల దర్యాప్తులో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీ చంద్రఘోష్ (Justice P Chandraghosh) కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు హరీశ్ రావుతో పాటు ఈటల రాజేందర్‌ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. నేడు హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణా రావు భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఫొటోలతో సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను కమిషన్ ముందు నిలబెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదని కామెంట్ చేశారు. ఆయన ఎప్పటికీ తెలంగాణ (Telangana) కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడేనని కొనియాడారు. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే అంటూ కాంగ్రెస్ (Congress) నాయకుల ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం.. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాళేశ్వరంతో తెలంగాణ దాహాన్ని తీర్చారు..
అదేవిధంగా మరో ట్వీట్‌లో ఆయన కథ చరిత్ర అని.. 60 ఏళ్లుగా సాధ్యం కాని అద్భుతాన్ని సాధించారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ కోసం స్వచ్ఛమైన ఉత్సాహంతో ఒక ప్రజాస్వామ్య ప్రచారాన్ని నడిపించారని.. ఆయన నాయకత్వంలో మిలియన్ల మంది ప్రజల కల అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణ దాహాన్ని తీర్చారని.. చిన్న మనసులు ఒక జీవితంలో KCR యొక్క శక్తిని అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు. వంద జీవితాలలో కాంగ్రెస్ కోమలులు KCR తెలంగాణ కోసం చేసిన ఒక్క అంశాన్ని కూడా సాధించలేరని.. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






