MLA Yennam Srinivas Reddy : కేసీఆర్ అసెంబ్లీ కంటే ఫామ్ హౌసే గొప్ప అనుకుంటున్నారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-10 08:28:28  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)అసెంబ్లీ కంటే తన ఫామ్ హౌజ్ గొప్ప అనుకుంటూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy)విమర్శించారు

MLA Yennam Srinivas Reddy : కేసీఆర్ అసెంబ్లీ కంటే ఫామ్ హౌసే గొప్ప అనుకుంటున్నారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)అసెంబ్లీ కంటే తన ఫామ్ హౌజ్ గొప్ప అనుకుంటూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy)విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రశ్నించే పార్లమెంటరీ విధానాలను పాటించకుండా కేసీఆర్ కించపరస్తున్నాడని శ్రీనివాస్ రెడ్ది విమర్శించారు. పార్లమెంటరీ విధానాలకంటే తమ కుటుంబం ఎక్కువన్న భ్రమలో కేసీఆర్ కుటుంబ వైఖరీ ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు కంటే కూడా తమ ఫామ్ హౌజ్ ఎక్కువన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు సైతం సెక్రటేరియట్ రాకుండా, సీఎంగా ఎవరిని కలవకుండా కేసీఆర్ సొంత రాజ్యంగాన్ని అమలు చేశారని విమర్శించారు. సెక్రటేరియట్ లో ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పుబడుతున్న కేసీఆర్ కుటుంబం ఉద్యమం కాలంలో తెలంగాణ భవన్ లో రూపకల్పన చేసిన తెలంగాణ విగ్రహంపై అధికారంలో ఉన్నప్పుడు వారు అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టి ఆమోదించే ప్రయత్నం చేయలేదని నిలదీశారు. ఎంతసేపు కేసీఆర్ చుట్టు, వారి కుటుంబం భజన చుట్టునే రాష్ట్ర రాజకీయాలు, పాలన నడిపించారని, అందుకే వారు ప్రజలకు దూరమయ్యారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశాన్ని ప్రజల్లో, చట్ట సభల్లో చర్చ పెట్టి ప్రజాస్వాయ్యయుతంగా నిర్ణయాలు తీసుకుంటుందని యెన్నం స్పష్టం చేశారు.

రాజకీయం కోసం కవిత కేటీఆర్ దిగజారి మాట్లాడ్తున్నారని, తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ తల్లికి మట్టిగాజులే ఉంటాయి కనకపు ఆభరణాలు ఉండవని, కవితది డబ్బులున్న సోపతి, అందుకే తెలంగాణ తల్లిలో బీదరికం కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ఆనాడు ఏర్పాటు చేసిన విగ్రహం శ్రామికవర్గాని సంబంధం లేకుండా ఉందని అభ్యంతరాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విషయంలో అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఅరెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ తల్లి విగ్రహం గాంధీ భవన్ తరలిస్తాం అంటున్నారని, చట్టసభల ద్వారా ఏర్పాటు చేసిన విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహమన్న సంగతి మరువరాదన్నారు. బిడ్డా కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావులను హెచ్చరిస్తున్నామని.. విగ్రహం టచ్ చేసి చూడండని సవాల్ చేశారు. మీరు అధికారంలోకి వస్తాం అని కలలు కంటున్నారని, తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు తెలంగాణ ప్రజల సొంతమని తేల్చిచెప్పారు.

Next Story