- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR దర్యాప్తునకు సహకరించాలి: టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
కాళేశ్వరం పేరుతో భారీ అవినీతి జరిగిందని, గత పాలకులు ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు ఉరితాడు వేశారని టీ పీసీసీ అధికార ప్రతినిధి

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం పేరుతో భారీ అవినీతి జరిగిందని, గత పాలకులు ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు ఉరితాడు వేశారని టీ పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆరోపించారు. కాళేశ్వరం విచారణపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను తెలంగాణ తొలి సీఎం కేసిఆర్ గౌరవించాలని, ఘోష్ కమిషన్ దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. కేసీఆర్కు విచారణకు పిలుపు నేపథ్యంలో పీసీ ఘోస్ కమిషన్ పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికావన్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళు చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు తప్పడు సంకేతాలు వెళ్తాయన్నారు. కేసిఆర్ ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంజనీర్ గా కూడా వ్యహరించారని, దీంతోనే సమస్య మొదలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష కోట్ల అవినీతి, అలాగే లక్ష మంది యువత ఉపాధి కోల్పోయారని చనగాని దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఆనాడు అధికారులు, బీఆర్ఎస్ నాయకులు అవినీతిలో పోటీ పడ్డారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. విలువైన భూములను, సంపదను కొల్లగొట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారన్నారు. వారు సొంత ఆస్తులను మాత్రమే పెంచుకున్నారని మరేం చేయలేక పోయారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడకుండా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడం బాధాకరం అన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను పదేళ్లు బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. దాన్ని పున : నిర్మాణం చేయడం కోసం నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు శనేశ్వరం కనుక తెలంగాణ ప్రజలు కాళేశ్వరం పై పూర్తి దర్యాప్తును కోరుకుంటున్నారని, ఇందులో నిజా నిజాలు తెలాలంటున్నారని టీ పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. అందుకే ప్రభుత్వం కమిషన్ వేసిందన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్నేతలు ప్రభుత్వం పై , సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్టానికి ఉపయోగంలేని అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దండుకున్నారన్నారు. అవినీతి చెయ్యడం కోసమే ప్రాజెక్ట్ ల పేరు మీద అటవీ భూములను, ఇతర పేదల భూములను స్వాధీనం చేసుకుని పర్యావరణంను విధ్వసం చేశారన్నారు. కంచె గచ్చి బౌలి భూములపై మార్పింగ్ ఫొటోలతో పర్యావరణానికి ప్రభుత్వం హాని చేస్తుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు విమర్శలు చేశారని, కాంగ్రెస్ ఎప్పుడు కూడా వారి లాగా దిగజారుడు రాజకీయాలు చేయదని గుర్తు చేశారు. జస్టిస్పీసీ ఘోస్ కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసిఆర్ హాజరు అయి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, ఇక నైనా మీరు డొంక తిరుగుడు మాటలు ఆపండని డిమాండ్చేశారు. తప్పు చేసిన వారిని విచారిస్తే రాజకీయ కక్ష ఎలా అవుతుందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు.






