- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌ను తిట్టాలి.. చంద్రబాబును కాపాడాలి : రేవంత్ రెడ్డిపై గంగుల ఫైర్
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పాత పాట పాడారని.. కేసీఆర్‌ను తిట్టాలి, చంద్రబాబును కాపాడాలి అనే ఆత్రుత సీఎంలో కనిపించిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పాత పాట పాడారని.. కేసీఆర్‌ను తిట్టాలి, చంద్రబాబును కాపాడాలి అనే ఆత్రుత సీఎంలో కనిపించిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బనకచర్లపై యుద్ధం ప్రకటిస్తారనుకున్నామని.. కానీ, అలా జరగలేదని అన్నారు. లక్షల రూపాయలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరిట వృథా చేశారని ఆరోపించారు. మాజీమంత్రి హరీశ్‌రావు బనకచర్లపై బాహ్య ప్రపంచానికి చెప్పాకే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందని చెప్పారు. ఉత్తమ్ లేఖ రాసి సరిపెట్టుకున్నారే తప్ప సీరియస్ ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు.
హరీశ్‌రావు మంత్రి కిషన్‌రెడ్డికి సైతం లేఖ రాశారని.. చివరకు పీపీటీ ఇచ్చాకే ప్రభుత్వం సైతం పీపీటీ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎంతసేపూ రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడటం తప్ప.. రేవంత్, ఉత్తమ్‌ల దగ్గర సబ్జెక్టు లేదని విమర్శించారు. కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమంటే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. కేంద్రం బనకచర్లకు పర్యావరణ అనుమతులు నిరాకరించడం బీఆర్ఎస్ విజయమని చెప్పారు. అయినా ప్రాజెక్టు మొత్తం ఆపేదాకా బీఆర్ఎస్ విశ్రమించదని స్పష్టం చేశారు. బనకచర్లపై కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా సీఎం రేవంత్ సఫలం కారని పేర్కొన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబుకు కేసీఆరే టార్గెట్ అని, రేవంత్‌రెడ్డికి సైతం బనకచర్ల టార్గెట్ కాకుండా కేసీఆరే టార్గెట్ అయ్యారని అన్నారు. గోదావరి ట్రిబ్యునల్ వస్తే ఏపీకి అదనంగా నీటి కేటాయింపులు చేసుకునేందుకు చంద్రబాబు బనకచర్ల స్కెచ్ వేశారని ఆరోపించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. ఎ
మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్లపై అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. వచ్చే సోమవారమే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలన్నారు. బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని, రేవంత్‌రెడ్డి తాను గానీ ఇంకా ఎవరితోనైనా ఇప్పించాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు.
- Tags
- Gangula Kamalkar






