మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

by Bhoopathi Nagaiah |

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. సీపీఐ నారాయణ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే మోడీని ఎలా అనుమాన పడుతున్నారో కేసీఆర్‌ను కూడా ఆలాగే అనుమానించాల్సి ఉంటుందని అన్నారు. బుధవారం హైదరాబాద్ సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. ప్రధాని ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీయేలో కేసీఆర్ చేరాలని ఎప్పుడో ప్రతిపాదిస్తే ఆ విషయాన్ని ప్రధాని ఇప్పుడెందుకు చెప్పారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్, వైసీపీలు ఉన్నాయని ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసిపోయాన్నారు. పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్థం పోసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో నిజమైన కూటమి అంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అని ఒక వేళ ప్రధాని మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం అంటూ రెండు ముక్కలు అవుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయన్నారు.

Next Story