KCR: కొండపోచమ్మ సాగర్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |

కొండపోచమ్మ రిజర్వాయర్(Kondapochamma Sagar) వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

KCR: కొండపోచమ్మ సాగర్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: కొండపోచమ్మ రిజర్వాయర్(Kondapochamma Sagar) వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. పండుగపూట ఐదుగురు యువకులు మరణించడం బాధాకరం అన్నారు. యువకుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలోని కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story