యశోదా ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

by Kema Shiva Kumar |

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇవాళ మరోసారి వైద్యుల సూచనల మేరకు సోమాజిగూడ (Somajiguda) యశోద ఆసుపత్రి (Yashoda Hospital)కి వెళ్లారు.

యశోదా ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇవాళ మరోసారి వైద్యుల సూచనల మేరకు సోమాజిగూడ (Somajiguda) యశోద ఆసుపత్రి (Yashoda Hospital)కి వెళ్లారు. గత వారం తీవ్రమైన జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఆర్యోగం కుదుటపడటంతో మరోసారి వైద్య పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన వెంట హరీశ్ రావు (Harish Rao) దంపతులు, కేటీఆర్ (KTR) దంపతులు కూడా ఉన్నారు. మెడికల్ టెస్ట్‌లు పూర్తి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story