- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ (వీడియో)
నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం సాయంత్రం నందినగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ(BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నుంచి నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. రేపటి సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరుతెన్నులపైన ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాల పైన సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రధానంగా నదీ జలాల అంశాలపై ఓ కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని గులాబీ బాస్ కేసీఆర్ చెబుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో






