నందీనగర్ నివాసంలో కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయిన కేసీఆర్

by Muthe.Rajitha |

నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం జరగనుంది.

నందీనగర్ నివాసంలో కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయిన కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం జరగనుంది. కాగా సమావేశానికి ముందు కేసీఆర్ తన నందీనగర్ నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సీనియర్ నేత హరీష్ రావుతో గంటపాటు కీలక చర్చలు జరిపారు. సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై వారు లోతుగా సమాలోచించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టు చెబుతున్న నీటి దోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సమీక్ష, హామీల అమలులో లోపాలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, పార్టీలో సంస్థాగత బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story