KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస భేటీలు

by Prasad Jukanti |

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస భేటీలు ఆసక్తిగా మారుతున్నాయి.

KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస భేటీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ కీలక నేతలతో రెండో రోజు సమావేశం (KCR farmhouse meeting) అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిన్న కేటీఆర్(KTR), హరీశ్ రావు (Harish Rao) ఇతర నేతలతో భేటీ కాగా ఇవాళ కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర నేతలతో సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందజేయడం, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పీకర్ కు 3 నెలల గడువు విధిస్తూ తీర్పు వెలువరించడం, బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాదాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా స్పందించే విషయంలో కార్యచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కరీంనగర్ లో బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన బీసీ సభలో కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే వరుసగా రెండో రోజు పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కావడం ఆసక్తిగా మారింది.

మరికాసేపట్లో హరీశ్ రావు ప్రెస్ మీట్:

ఎర్రవల్లిలో కేసీఆర్ తో భేటీ అనంతరం హరీశ్ రావు తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. అక్కడ బనకచర్ల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. నిన్న మంత్రి లోకేశ్ మాట్లాడుతూ సముద్రంలో కలిసే వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి? దాంతో తెలంగాణకు వచ్చే నష్టం ఏముంది అని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టులో తప్పు లేదని మేము తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం లేదన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రేపేంటదుకు కొందకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ ఆరోపణలపై హరీశ్ రావు స్పందించే అవకాశం ఉంది.

Next Story