నేడు మరోసారి కీలక నేతలతో కేసీఆర్ భేటీ!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-23 05:35:37  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో హరీష్, రావు కేటీఆర్‌లతో భేటీ అయిన కేసీఆర్ ఈరోజు కూడా సమావేశం అయ్యారు. ఈ భేటీలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలు సైతం పాల్గొన్నారు.

నేడు మరోసారి కీలక నేతలతో కేసీఆర్ భేటీ!
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో హరీష్, రావు కేటీఆర్‌లతో భేటీ అయిన కేసీఆర్ ఈరోజు కూడా సమావేశం అయ్యారు. ఈ భేటీలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలు సైతం పాల్గొన్నారు. సమావేశంలో జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి చర్చించనున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహాలపై కేసీఆర్ ఇంచార్జిలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇప్పటికే ఎన్నికల ప్రచార రథ సారథుల లిస్టు విడుదల చేయగా అందులో కేసీఆర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ సైతం ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెండంతో ఉప ఎన్నిక రాగా మ‌ళ్లీ ఏ పార్టీ గెలుస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

READ MORE ...

కదనరంగంలోకి గులాబీ బాస్.. జూబ్లీహిల్స్ బై‌పోల్‌పై KTR, హరీశ్‌లతో భేటీ

Next Story