- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరిన KCR.. బీఆర్కే భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదట బహిరంగ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేసీఆర్ (KCR) కాసేపటి క్రితం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ (Erravelli Farm House) నుంచి బయలుదేరారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదట బహిరంగ విచారణకు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కాసేపటి క్రితం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ (Erravelli Farm House) నుంచి బయలుదేరారు. సరిగ్గా ఆయన 11.30కి నగరంలోని బీఆర్కే భవన్ (BRK Bhavan)కు చేరుకోనున్నారు. సమారు వంద కార్లకు పైగా కాన్వాయితో గులాబీ బాస్ విచారణకు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌కు మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక కేసీఆర్ వెంట బీఆర్కే భవన్ లోపలికి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మహబూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ బహిరంగ విచారణ సందర్భంగా వేలల్లో కార్యకర్తలు బీఆర్కే భవన్ వద్దకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఆర్కే భవన్ రోడ్డును తాత్కాలికంగా మూసి వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా వందల్లో పోలీసులను మోహరించారు.
బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత.. BRS కార్యకర్తల ఆందోళన
కమిషన్ ఎదుట కేసీఆర్ (KCR) విచారణ హాజరవుతుండటంతో బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. మెయిన్ గేట్ వద్ద రెప్పపాటులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ అధినేత కేసీఆర్‌కు మద్దతుగా పెద్ద ఎత్తు నినాదాలు చేస్తున్నారు. అయితే, వారు లోనికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారికి అడ్డుకుంటుండటంతో అక్కడ టెన్షన్ వాతావారణం నెలకొంది.






