- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Kumar Goud : కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళతారు : మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) చేసిన కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) చేసిన కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేడు నిజామాబాద్ పర్యటనలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్.. స్థానిక సంస్థల ఎన్నికల(Loacl Body Election)పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు.
తాము బనకచర్ల(Banakacharla) ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాప్(Phone Tapping Case) చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చానని, కేసీఆర్, కేటీఆర్‌లు సిగ్గుతో తలదించుకోవాలని, ఈ వ్యవహారంలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్ళక తప్పదన్నారు.






