- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టులో KCR, KTR, హరీశ్‌రావు పిటిషన్.. విచారణ వచ్చే నెల 9కి వాయిదా
తెలంగాణ ఉద్యమ కాలం నాటి (మిలియన్ మార్చి’ కేసులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో అత్యంత కీలకమైన ‘మిలియన్ మార్చి’ సందర్భంగా తమపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)లు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 2011లో ట్యాంక్‌బండ్‌పై జరిగిన మిలియన్ మార్చి సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు పాల్గొన్న తమపై రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదయ్యాయని, వాటిని వెంటనే కొట్టివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులైన ప్రభుత్వానికి, సంబంధిత పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఆ రోజున ప్రభుత్వం దాఖలు చేసే వివరణ ఆధారంగా కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.






