- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు.. మరో పేరు తెరపైకి తెచ్చిన సీపీఐ నారాయణ
తెలంగాణ రాజకీయం అంతా జాతిపిత అంశం చుట్టూ తిరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జాతిపిత (Telangana Jathipitha) ఎవరు అనేదాని చుట్టూ రాజకీయం రంజుగా సాగుతోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‍ను (KCR) సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'ఎవనికిరా నువ్వు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై చర్చకు దారి తీశాయి. దీంతో తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాదని ప్రొఫెసర్ జయశంకర్ సార్ అసలైన తెలంగాణ జాతిపిత అని కొందరంటుంటే లేదు లేదు కేసీఆరే జాతిపిత అంటూ మరికొందరు వాదనలు చేస్తున్నారు. ఈ చర్చ ఇలా సాగుతున్న వేళ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదని రావి నారాయణ రెడ్డి అసలైన తెలంగాణ జాతిపిత అన్నారు. ఇవాళ మహబూబాబాద్‍లో మాట్లాడిన ఆయన..వేలాది ఎకరాల భూములు పేదలకు పంచి సాయుధ పోరాటం చేసిన రావినారాయణ రెడ్డే తెలంగాణ జాతిపిత అన్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ కు పేటెంట్ ఉన్నప్పటికీ జాతిపిత మాత్రం కాదన్నారు.






