- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిల్లర రాజకీయాలకు కేసీఆర్ వణికిపోడు : కేటీఆర్
‘మీ చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ వణికిపోయే వ్యక్తి కాదు. కేసీఆర్ అజేయుడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

- దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిని మనిషి
- మీరు చరిత్రను కూడా అర్థం చేసుకోలేరు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీ చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ వణికిపోయే వ్యక్తి కాదు. కేసీఆర్ అజేయుడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సిట్ విచారణపై ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని.. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకన్ కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని వ్యక్తి కేసీఆర్ అని.. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి తెలిపారు. మూర్ఖులు చరిత్రను సృష్టించడం పక్కన పెడితే.. కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరని విమర్శించారు. ‘ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతున్నదని.. ఆయన పేరు ఎత్తే స్థాయి కూడా మీకు లేదు’ అని సూచించారు. ఈరోజు ఎంత విషం చిమ్మినా.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర అని.. ఆ చరిత్రలో మీరు కనీసం ఒక చిన్న ఫుట్‌నోట్ కూడా కాలేరని పేర్కొన్నారు.






