- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీకి రాబోతున్నా కేసీఆర్.. అక్కడే అన్నీ వివరిస్తామని ప్రకటన
అసెంబ్లీకి రాబోతున్నా కేసీఆర్.. అక్కడే అన్నీ వివరిస్తామని ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహమే చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్‌కు వేరే పార్టీలకు తెలంగాణపై పట్టింపు లేదని తెలిపారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర, రాష్ట్ర విధానాల పట్ల పోరాటం చేయాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీల విధానాలను ఎండగడుతామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాం.. ఉద్యమాన్ని నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను పరిక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్‌పైనే ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని చెప్పారు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని.. అసెంబ్లీలోనే ద్రోహాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ముందు నిర్ణయించిన విధంగా బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.






