ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా KCR భారీ స్కెచ్.. BRS అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్..!

by Satheesh |
ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా KCR భారీ స్కెచ్.. BRS అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని సీనియర్ నేతలు, ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న నేతలను టార్గెట్ చేస్తున్నారు. అసంతృప్త నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుని.. పార్టీని పటిష్ట పరిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్రాల్లో పట్టు ఉన్న బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇందులో భాగంగానే పొరుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు.

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, వైసీపీలోని అసంతృప్తి నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకునేలా వ్యుహం రచించారు. సామాజిక వర్గాల వారిగా బలంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి.. బీఆర్ఎస్‌లో చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకుని ఏపీలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే ఇవాళ ఏపీలోని కీలక నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోనున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్, మాజీ ఐఎఏస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి వంటి నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు సైతం ఇవాళ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, వీరి చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణకు తొలి అడుగుపడింది.

కాపు ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా కేసీఆర్ భారీ వ్యుహం!

మాజీ ఐఎఏస్ అధికారి తోట చంద్రశేఖర్ కేసీఆర్ సమక్షంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే, తోట చంద్రశేఖర్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం వెనుక కేసీఆర్ భారీ వ్యుహాం రచించినట్లు తెలుస్తోంది. కాపు నేత అయినా తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించి.. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన కాపు ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా గులాబీ బాస్ భారీ స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే తోట చంద్రశేఖర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వ్యుహాలు రచించడంలో దిట్ట అయిన కేసీఆర్.. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారు.

Also Read...

గులాబీ పార్టీకి డొనేషన్ల వెల్లువ.. 2022లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

chandrababu ''మాకు ఇదేమి ఖర్మ'': KA Paul తీవ్ర విమర్శలు

Next Story

Most Viewed