- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponnam : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ కు ఆహ్వానం : మంత్రి పొన్నం
రాష్ట్ర సచివాలయం(State Secretariat)లో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Mother Statue)ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర సచివాలయం(State Secretariat)లో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Mother Statue)ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా ఆహ్వాన పత్రికలు తాను వారికి అందించనున్నట్లుగా తెలిపారు.
కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ లను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు సమయం ఇవ్వాలని వారి వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించామమని, వారు సమయమిచ్చిన మేరకు వారి వద్దకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తానని పొన్నం పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రకటనతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు సంబంధించి కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు అధికారిక ఆహ్వానం అందనుండగా, ఇక ఈ కార్యక్రమానికి వారు హాజరవుతారో లేదోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.






