- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రవెల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. పార్టీ బలోపేతంపై ఫోకస్
బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో సోమవారం కీలక సమావేశం జరిగింది.

దిశ, ములుగు : బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలి పక్షాల ఉపనాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు టీ. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, డా. బండ ప్రకాష్ ముదిరాజ్, వి. గంగాధర్ గౌడ్, జోగినపల్లి సంతోష్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టి. జీవన్ రెడ్డి, సోమా భరత్ కుమార్ గుప్తా, సత్యవతి రాథోడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కెఆర్. సురేష్ రెడ్డి, మహమూద్ అలీ, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.






