CM Revanth Reddy : తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారు : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-07-09 14:04:52  IST  )

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కృష్ణా నది జలాలపై ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తోంది.

CM Revanth Reddy : తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కృష్ణా నది జలాలపై ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తోంది. ఈ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) హయాంలోనే ఏపీ కృష్ణా జలాల్లో(Krishna Water) నీటి దోపిడీ మొదలైంది. బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆరే. మరణ శాసనం రాసే హక్కు ఆయనకు ఎవరిచ్చారని రేవంత్ రెడ్డి నిలదీశారు. గతంలో చిన్నారెడ్డి మంచి సూచనలు చేస్తే, ఆయనను అవమానించారు.

అహంకారపూరిత నిర్ణయంతో కృష్ణా జలాల్లో నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంచనాలు భారీగా పెంచి కూడా పూర్తి చేయలేదని అన్నారు. కృష్ణా నీటిని రాయసీమకు వదిలేసే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని, ఆయన రాయలసీమకు పాలేగాడిగా మారారా అని అడుగుదామంటే అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదన్నారు. నన్ను ప్రెస్ కలాన్ కు రమ్మని ఒకాయన సవాల్ విసిరాడని, పేరు ఎత్తి మాట్లాడే స్థాయి కూడా అతనికి లేదని మండిపడ్డారు. క్లబ్బులకు పబ్బులకు మేము ముందు నుంచి దూరం అని, కావాలంటే ఎర్రవల్లి ఫాంహౌసుకు వస్తామని అన్నారు.

మా పాలనలో రాష్ట్రానికి నష్టం జరిగినట్టు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు. చనిపోయిన పార్టీని బతికించుకోడానికి ఇప్పుడు నీళ్ళ సెంటిమెంట్ రేపుతున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణా విషయంలో కేసీఆర్, ఆ పార్టీ చేసిన ద్రోహానికి 100 కొరడా దెబ్బలు కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story