నీళ్లు– నిధులు–నియామకాలను పూర్తి చేయని కేసీఆర్​ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణలో సాగునీటి ఇబ్బందులకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీయే కారణమని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు.

MLC Jeevan Reddy Criticizes Komatireddy Rajagopal Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సాగునీటి ఇబ్బందులకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీయే కారణమని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్​ సొంత ఎజెండా వల్లే తెలంగాణకు సాగునీటి సమస్య తలెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్​నీళ్లు– నిధులు–నియామకాలను పూర్తి చేయలేదన్నారు. గాంధీ భవన్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సెల్బీసీ ఘటన దురష్టకరమన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఆపాల్సిన అసవరం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్సెల్బీసీ 55 శాతం పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్​ముఖ్యమంత్రి అయ్యాక సంవత్సరానికి కిలో మీటర్ తవ్వింది లేదని విమర్శించారు. కేసీఆర్​హయంలోనే ఎస్సెల్బీసీ పూర్తి చేసి ఉంటే.. ప్రస్తుతానికి ఇంతటీ ఇబ్బంది ఉండపోయేదన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డలపై దృష్టి పెట్టారు తప్పా.. తమ్మడిహెట్టిని పట్టించుకోలేదని జీవన్​రెడ్డి ఆరోపించారు.

కాలువులు రీ డిజైన్​చేయలేదు.. రీ డిజైన్​చేసి ఉంటే.. ఈనాడు సమస్యలు వచ్చేవి కావని పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేందుకు 4వేల కోట్లు చేశారు. ఇదే ఖర్చు తమ్మడిహెట్టికి పెట్టి ఉంటే..నీటి సమస్య వచ్చేది కాదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల జగిత్యాల, ధర్మపురి ప్రాంతాన్ని ముంపునకు గురి చేశారని విమర్శించారు. తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని సీఎం, ఇరిగేషన్ మినిస్టర్ కి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రానున్న బడ్జెట్ లో తుమ్మడి హాట్టికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్​పేరుతో కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ సర్కారు కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మన వాటా కాపాడుకోవాలని కోరారు. రాయలసీమ ప్రాజెక్టు పేరుపై కృష్ణా జలాలను తరలించడాన్ని అడ్డుకొని తీరాలని జీవన్​రెడ్డి పేర్కొన్నారు.

Next Story