- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ముగిసిన కేసీఆర్, హరీష్‌రావు భేటీ!
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ (KCR), హరీష్ రావు(HARISH RAO) మధ్య భేటీ ముగిసింది. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం సాగింది.

దిశ, వెబ్ డెస్క్: ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ (KCR), హరీష్ రావు(HARISH RAO) మధ్య భేటీ ముగిసింది. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం సాగింది. కాళేశ్వరం కమిషన్(KALESHWARAM COMMISION) ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన విచారణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. కమిషన్ ముందు వినిపించాల్సిన వాదనలపై చర్చించినట్టు సమాచారం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను ఎల్ అండ్ టీ తప్పుపట్టడంపై కూడా చర్చింనట్టు తెలుస్తోంది.
వీటితో పాటూ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై సైతం చర్చ జరిగినట్టు సమాచారం అందుతోంది. ఇక కేసీఆర్ జూన్ 5న కమిషన్ ముందు హాజరు కానుండగా, హరీష్ రావు జూన్ 9న హాజరుకానున్నారు. అంతే కాకుండా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూన్ 6న కమిషన్ ముందు హాజరవుతారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆ ప్రాజెక్టు విచారణకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. విచారణ చవరి దశలో ఉండగా అప్పటి సీఎం కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటల, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులు హాజరవ్వాలని ఆదేశించింది.






