High Court : కేసీఆర్, హరీష్ రావుల కేసు విచారణ వాయిదా

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-21 09:49:23  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KSR), మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)లు హైకోర్టు(High Court)లో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా(Postponed to Monday) పడింది.

High Court : కేసీఆర్, హరీష్ రావుల కేసు విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KSR), మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)లు హైకోర్టు(High Court)లో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా(Postponed to Monday) పడింది.

మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్‌, హరీశ్‌రావు, ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణకు కేసీఆర్, హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ రోజు విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టులో వారిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందాడని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసు ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావులు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నిర్మాణంలో అవతవకలు జరిగాయంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై భూపల్లిపల్లి కోర్టులో కేసు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి తాజాగా హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. దీంతో వ్యవహారం రాజకీయం రంగు పులుముకుంది.


Read More..

అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న సీఎం.. రైతు ధర్నాపై హరీశ్ రావు రియాక్ట్

Next Story