Erravelli: మంత్రి పొన్నం ప్రభాకర్‌ బృందానికి లంచ్ ట్రీట్ ఇచ్చిన కేసీఆర్

by Gantepaka Srikanth |

రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి(telangana Thalli) విగ్రహావిష్కరణకు రావాలని బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar) ఆహ్వానించారు.

Erravelli: మంత్రి పొన్నం ప్రభాకర్‌ బృందానికి లంచ్ ట్రీట్ ఇచ్చిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి(telangana Thalli) విగ్రహావిష్కరణకు రావాలని బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar) ఆహ్వానించారు. ముందుగా కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(Joginapally Santosh Kumar), మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావులు స్వాగతం పలికారు.

తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ బృందానికి లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు సమయంలో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.

Next Story